- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలి
నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అన్నారు.

దిశ, జగదేవపూర్ : నిరుద్యోగ యువత, మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అన్నారు. గురువారం జగదేవపూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ లో యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులు, నిరుద్యోగ యువత కోసం ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సుల పై అవగాహన సదస్సు నిర్వహించారు. శిక్షణ అవకాశాలు, అర్హతలు, దరఖాస్తు విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 50 సంవత్సరాల వయసుగల మహిళలు, పురుషులు, యువ రైతులు ఈ శిక్షణలకు అర్హులని తెలిపారు.
ఈ శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు పూర్తిగా ఉచితంగా శిక్షణతో పాటు హాస్టల్, భోజనం, టిఫిన్, యూనిఫామ్ కోర్స్ మెటీరియల్ అందజేస్తారని వివరించారు. ఒక్కో బ్యాచ్ లో 35 మందికి అవకాశం ఉంటుందని శిక్షణలో భాగంగా బేసిక్ ఇంగ్లీష్, కంప్యూటర్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ మేనేజ్మెంట్ అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కోర్సు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ తో పాటు స్వయం ఉపాధి కోసం బ్యాంకు రుణాల విషయంలో సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరమేశ్వర్, ఉపసర్పంచ్ బాబు, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు నాయక్, మహమ్మద్ నజీమ్, కరుణాకర్, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.






