అమరావతిని ఆపడం ఎవడి తరం కాదు: మావిగన్‌పై సీఎం సీరియస్ కామెంట్స్

by Vemula.Srinu Prasad |

అమరావతిని ఆపడం ఎవడి తరం కాదని సీఎం చంద్రబాబు అన్నారు. జగన్ మావిగన్‌కే కట్టుబడి ఉన్నామన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ..

అమరావతిని ఆపడం ఎవడి తరం కాదు: మావిగన్‌పై సీఎం సీరియస్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి(Amaravati)ని ఆపడం ఎవడి తరం కాదని సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అన్నారు. జగన్ మావిగన్‌(Mavigan)కే కట్టుబడి ఉన్నామన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లిలో వీబీజీ రామ్‌జీ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎవరు ఎన్ని మాటలు అన్నా అమరావతి దేవతల రాజధాని అని, ఇక్కడే వెంకటేశ్వరస్వామి(Lord Venkateswara) ఉన్నాడని, ఆయనే చూసుకుంటాడని చంద్రబాబు తెలిపారు. ఏపీ(Ap)కి కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పారు. అటు పోలవరం పూర్తికి సైతం అన్ని విధాలుగా నిధులు విడుదల చేస్తు్న్నారని చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో గోదావరి పుష్కరాలున్నాయని, ఆలోపే పోలవరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే విశాఖ రైల్వే జోన్‌ను సాధించామని, కేంద్రం సహకారంతో స్టీల్ ప్లాంట్‌ను కూడా కాపాడుకోగలిగామని చంద్రబాబు చెప్పారు.

త్వరలో డేటా సెంటర్..

విశాఖకు త్వరలో డేటా సెంటర్ వస్తుందని, పుట్టపర్తిలో ఆంకా ద్వారా ఫిఫ్త్ జనసేరేషన్ ఫైటర్ జెట్ కూడా వస్తుందని పేర్కొన్నారు. రాయలసీమ రాళ్లసీమకాదని, రత్నాల సీమని తాను, పవన్ కల్యాణ్ చెప్పామని చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమలో అన్ని రంగాల్లో అగ్రస్థానంలో పెట్టే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. రాయల్‌ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ చిరునామా కూడా రాయలసీమేనని సీఎం చంద్రబాబు తెలిపారు. జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసి 28 ఏప్రిల్ లోపు పూర్తి చేసి రాయలసీమ చిరకాల వంచ నెరవేరుస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Next Story