Aishwarya Rajesh: 35 సినిమాల ద్వారా రాని క్రేజ్‌ను ఆ ఒక్క మూవీ తీసుకొచ్చింది

by Pulgam srinivas |

దాదాపు 35 సినిమాలు చేసినా రాని క్రేజ్‌ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వచ్చిందని ఐశ్వర్య రాజేష్ వెల్లడించింది.

Aishwarya Rajesh: 35 సినిమాల ద్వారా రాని క్రేజ్‌ను ఆ ఒక్క మూవీ తీసుకొచ్చింది
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ప్రధానంగా తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఐశ్వర్య రాజేష్ 'ఇసకపట్నం' అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషించింది. ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య రాజేష్‌కు, "మీరు కెరీర్ ప్రారంభించి చాలా కాలమైంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే మీకు 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతోనే భారీ గుర్తింపు వచ్చిందని చాలామంది భావిస్తున్నారు. మీరు కూడా అదే అనుకుంటున్నారా?" అనే ప్రశ్న ఎదురైంది.

దానికి ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ.. "నేను ఇప్పటివరకు దాదాపు 35 సినిమాల్లో నటించాను. ఆ 35 సినిమాల ద్వారా రాని క్రేజ్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో వచ్చింది. ఆ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అందులో నేను పోషించిన పాత్ర చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ బాగా కనెక్ట్ అయింది. అలాంటి పాత్ర దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్‌లో అది ఎప్పటికీ చాలా ప్రత్యేకమైన పాత్రగా నిలిచిపోతుంది" అని చెప్పుకొచ్చింది. ఇక ఐశ్వర్య రాజేష్ తాజాగా తిరువీరు హీరోగా నటిస్తున్న 'ఓ..! సుకుమారి' చిత్రంలో కథానాయికగా నటించింది. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story