- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సీఐని సీపీ.. సీఎం చంద్రబాబు డీజీపీని రక్షిస్తున్నారు: వైఎస్ జగన్
విజయవాడలో సీఐ వేధింపులకు బలైన క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్.. సీఐని సీపీ, సీపీని డీజీపీ, డీజీపీని సీఎం రక్షిస్తున్నారని మండిపాటు!

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల దళిత యువకుడు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) గురువారం అతని నివాసానికి వెళ్లారు. క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వైఎస్సార్సీపీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. గత 8 ఏళ్లుగా ఎలాంటి తప్పు చేయకుండా, ట్యాక్సీ నడుపుకుంటూ జీవిస్తున్న క్రాంతి కుమార్‌పై ప్రస్తుతం ఎలాంటి కేసులు లేవని స్పష్టం చేశారు. అయినప్పటికీ గత మూడు నెలలుగా అతడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి మానసిక టార్చర్ పెట్టడమే కాకుండా, పోలీసులు చేయకూడని అక్రమ పనులను బెదిరించి చేయించారని మండిపడ్డారు. పోలీసులు పెట్టిన చిత్రహింసల వల్లే తాను చనిపోతున్నట్లు క్రాంతి కుమార్ తన మరణవాంగ్మూలం లో స్పష్టంగా పేర్కొన్నాడని జగన్ గుర్తు చేశారు.
ఈ ఘోరమైన ఘటనలో నిజాలను దాచేందుకే కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని రాత్రికి రాత్రే ఎందుకు డిలీట్ చేశారని జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో తప్పు చేసిన పోలీసులను కాపాడేందుకు వ్యవస్థలన్నీ ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. "ఇక్కడ తప్పు చేసిన సీఐని సీపీ.. సీపీని డీజీపీ.. డీజీపీని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రక్షిస్తున్నారు" అంటూ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని విజయవాడలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని, బాధ్యులైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ డిమాండ్ చేశారు.
- Tags
- YS Jagan






