దిగుబడి ఎక్కువ వచ్చింది...కేంద్రంతో కొనుగోలు చేయించాలి

by Taduka Kalyani |

యాసంగి సీజన్ లో వరి దిగుబడి ఎక్కువ వచ్చింది ఎక్కువ మొత్తంలో కేంద్రం కొనుగోలు చేసే విధంగా ఎంపీ రఘునందన్ రావు చొరవ తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు.

దిగుబడి ఎక్కువ వచ్చింది...కేంద్రంతో కొనుగోలు చేయించాలి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి: యాసంగి సీజన్ లో వరి దిగుబడి ఎక్కువ వచ్చింది ఎక్కువ మొత్తంలో కేంద్రం కొనుగోలు చేసే విధంగా ఎంపీ రఘునందన్ రావు చొరవ తీసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... జిల్లాలో అధికంగా పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసిన సంబంధిత శాఖ అధికారులను అభినందించారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. వానాకాలం సీజన్ కి సంబంధించి 45000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా ఇప్పటివరకు పదివేల మెట్రిక్ టన్నుల యూరియా రైతుల అందించడానికి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. యూరియా యాప్ చాలా చక్కగా పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ... ధాన్యం దిగుమతి సందర్భంగా మిల్లర్లు బస్తా కు 4 కే జీలు తగ్గించడం ద్వారా రైతులు తీవ్రంగా నష్టం జరిగింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మూలంగా మిల్లులో ధాన్యం మొలకలు వచ్చిందన్నారు. గత సీజన్కు సంబంధించిన సిఎంఆర్ నేటికీ మిల్లర్లు ఎఫ్సీఐకి అందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, వంటేరు యాదవ రెడ్డి, అంజిరెడ్డి, కొమురయ్య, అధికారులు పాల్గొన్నారు.

Next Story