- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమేనీ అంత్యక్రియలు.. భారత మత గురువుల నివాళి
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమానికి భారతదేశం తరఫున సర్వమత ప్రతినిధుల బృందం హాజరైంది.

దిశ, వెబ్ డెస్క్ : అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అధికారిక అంత్యక్రియల కార్యక్రమాలు జూలై 4 నుండి 9 వరకు ఇరాన్ లోని టెహ్రాన్, ఖోమ్, మషాద్ నగరాల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారతదేశం తరఫున ఒక ఉన్నత స్థాయి సర్వమత ప్రతినిధుల బృందం (Interfaith Delegation) హాజరు కానుంది. అందులో భాగంగా హిందూ, సిఖ్ మత గురువులు నేడు ఖమేనీ మృతదేహానికి నివాళులు అర్పించారు. ఇక ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందిగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ భారత ప్రధాని నరేంద్ర మోడీకి అధికారికంగా ఆహ్వానం పంపినప్పటికీ.. ముందే ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలు ఖరారు కావడం వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నారు. భారత ప్రభుత్వం తరఫున అధికారికంగా కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీతా, బీహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ నేడు ప్రత్యేక విమానంలో ఇరాన్ బయలుదేరారు.
వీరితో పాటు విదేశాంగ శాఖకు చెందిన ఉన్నతాధికారుల బృందం కూడా వెళ్తోంది. విపక్ష నేతలకు కూడా ఆహ్వానాలు అందగా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు స్థానంలో మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఇరాన్ వెళ్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ కూడా ఈ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఇరాన్ బయలుదేరారు. ఇరాన్‌ను మూడు దశాబ్దాలకు పైగా నడిపించిన సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, ఫిబ్రవరి 2026లో టెహ్రాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారు. ఆ సమయంలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడిన అంత్యక్రియలను, జూలై 4 నుండి ప్రారంభించి, జూలై 9న మషాద్ నగరంలో అంతిమ సంస్కారాలతో ముగించనున్నారు.






