పాములతో బ్రేక్ ఫాస్ట్.. అస్సలు భయం లేదంటూ నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!

by Mallepaka Hamsa |

ప్రకృతికి దగ్గరగా ఉండే ఆ ప్రాంతంలో, ముఖ్యంగా తమ పాతకాలపు పూర్వీకుల ఇంట్లో పాములు తిరగడం చాలా కామన్ విషయమని నభా చెప్పుకొచ్చారు.

పాములతో బ్రేక్ ఫాస్ట్.. అస్సలు భయం లేదంటూ నభా నటేష్ షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: నభా నటేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘నాగబంధం’. అభిషేక్ నామా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిశిత నాగిరెడ్డి నిర్మించారు. విరాట కర్ణ హీరోగా నటించిన ఈ సినిమా జూలై 3న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో పాల్గొన్న నభా నటేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా చాలామందికి పాము కనిపిస్తే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ నభా నటేష్ మాత్రం తనకు పాములంటే అస్సలు భయం లేదని, పైగా అవి చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంటాయంటూ వింత సమాధానం ఇచ్చారు. తను కర్ణాటకలోని హిల్ స్టేషన్ అయిన చిక్కమగళూరులో పెరగడం వల్లే పాములు చూడటం తనకు అలవాటైందని స్పష్టం చేశారు.

ప్రకృతికి దగ్గరగా ఉండే ఆ ప్రాంతంలో, ముఖ్యంగా తమ పాతకాలపు పూర్వీకుల ఇంట్లో పాములు తిరగడం చాలా కామన్ విషయమని నభా చెప్పుకొచ్చారు.చిన్నతనంలో జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను గుర్తుచేసుకుంటూ.. ఒకరోజు తను, తన తమ్ముడు కలిసి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ తింటున్న సమయంలో కళ్ల ముందే పాములు తిరుగుతున్నా అస్సలు భయపడకుండా చాలా సరదాగా చూస్తూ కూర్చున్నామని నభా వెల్లడించారు. అందుకే తనకు చిన్నప్పటి నుంచే పాములతో ఒక రకమైన బాండింగ్ ఏర్పడిందని నవ్వుతూ చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా అవాక్కవుతున్నారు.

Next Story