- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Akhil Akkineni: ఆ సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే ఇండియా మొత్తాన్ని షేక్ చేసేది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అక్కినేని అఖిల్
"రంగస్థలం" మూవీ ఓ మాస్టర్‌పీస్.. ఆ సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేదని అఖిల్ వ్యాఖ్యానించాడు.

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ఇటీవల ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించగా, ఈ సినిమాతో తప్పకుండా సూపర్ హిట్ అందుకుంటానని అఖిల్ పూర్తి ఆత్మవిశ్వాసంతో చెప్పడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా అఖిల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అఖిల్ మాట్లాడుతూ.. రంగస్థలం తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చిన ఓ మాస్టర్‌పీస్. కమర్షియల్ హీరో అయిన రామ్ చరణ్, వినికిడి సమస్యతో బాధపడే పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఒక కమర్షియల్ సినిమాలో హీరోకు అలాంటి సమస్యను చూపించి కూడా భారీ విజయాన్ని అందుకోవడం చిన్న విషయం కాదు. ఆ విషయంలో సుకుమార్ గారు సూపర్ సక్సెస్ అయ్యారని అన్నారు.
అంతేకాకుండా ఆ సినిమాలో హీరో వినికిడి సమస్య కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటాడు. అలాంటి పాత్రను అంత అద్భుతంగా చూపించడం చాలా గొప్ప విషయం. నా అభిప్రాయం ప్రకారం 'రంగస్థలం' సినిమా ఇప్పుడు విడుదలై ఉంటే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించేదని అఖిల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక 'లెనిన్' చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.






