- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ రాక కోసం వేచి చూసిన బీజేపీ నేతలు.. ఖాళీ కుర్చీకి వినతిపత్రం
జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు.

దిశ , జహీరాబాద్: జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆందోళన నిర్వహించారు. ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ నాయకులు స్థానిక ఇన్‌చార్జ్ డాక్టర్ కిరణ్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో నిరసనగా ఖాళీ కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు పూల సంతోష్ మాట్లాడుతూ.. స్థానిక ఆసుపత్రిలో రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని విమర్శించారు. వైద్యులు, సిబ్బంది , మందుల కొరత, పారిశుద్ధ్య లోపం, తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుధీర్ బండారి, కృష్ణారెడ్డి, బీజేపీ కౌన్సిలర్లు బొగ్గుల సంతోష్, అప్పం శ్రావణ్, అరుణ్ కుమార్, విశ్వనాథ్ యాదవ్, సోమ అనిల్, పాలింకర్ సంతోష్, నరేష్ పాటిల్, బండి వెంకట్, రాయిపల్లి సునీల్, సురేష్, పూరి శివ, పూజ, శ్రీకాంత్, మహేష్ ముదిరాజ్, మంజునాథ్, చందు, అబ్జర్, దిల్దర్, రాజ్‌కుమార్, చరణ్, డీకే సతీష్ తదితరులు పాల్గొన్నారు.






