- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జోలికొస్తే బిడ్డల్లారా.. తోలుతీస్తాం’.. మాజీ మంత్రి మాస్ వార్నింగ్
కులవృత్తుల వారితో పాటు మా కార్మికుల జోలికొస్తే బిడ్డల్లారా తోలు తీస్తాం.. వారు నాయకులే కానీ అధికారులే కానీ ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.

దిశ,తుంగతుర్తి: కులవృత్తుల వారితో పాటు మా కార్మికుల జోలికొస్తే బిడ్డల్లారా తోలు తీస్తాం.. వారు నాయకులే కానీ అధికారులే కానీ ఎవరిని కూడా వదిలి పెట్టేది లేదంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. వేధించే వారి పేర్లను రాసుకొని మా ప్రభుత్వం వచ్చాక వదిలేది లేదని మరోసారి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు వచ్చేది మా ప్రభుత్వమే అనే విషయాన్ని వారంతా గుర్తుంచుకోవాలని సూచించారు. గీత కార్మికులపై ఎక్సైజ్ తో పాటు నాయకుల వేధింపులు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. బుధవారం హైదరాబాద్ నుంచి మహబూబాబాద్ కు వెళ్తున్న ఆయన తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో గౌడ కులస్తుల కోరిక మేరకు కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండాల మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో గీత కార్మికులు ఘన స్వాగతం పలికారు.
గ్రామంలోని కంఠమహేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేశారు. గౌడ కులస్తులతో కలిసి సురా పానకాన్ని సేవించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకృతి ఇచ్చిన కల్లును చిన్న చూపు చూస్తూ బీరు, బ్రాందీలకు పెద్దపీట వేస్తోందని అన్నారు. మా ప్రభుత్వం వస్తే కల్లు దుకాణాలకు శాశ్వతంగా ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తామన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. పురుగు మందులతో పాటు ఎండ్రిన్ తీసుకుంటేనే యూరియా సంచి ఇస్తామంటుంటే అవసరం లేని వాటిని ఎందుకు తీసుకోవాలన్నారు. ఎండ్రిన్ తీసుకొని చావమంటారా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో రామగుండం ఉన్నప్పటికీ కేంద్రాన్ని ఎందుకు నిలదీయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.






