- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ హీరోయిన్ అంటే క్రష్ అంటున్న ఆనంద్ దేవరకొండ.. ఆసక్తికర కామెంట్స్ వైరల్
ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అదే జోష్‌తో ఇప్పుడు ‘ఎపిక్’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లండన్ నేపథ్యంలో సాగే ఒక మోడరన్ లవ్ స్టోరీగా రాబోతోంది. ఇందులో ఆనంద్ దేవరకొండకు జోడీగా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి.
జూలై 24న థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న ఆనంద్ దేవరకొండ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. ఇందులో ఆయనకు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది... మీ ఫస్ట్ క్రష్ ఎవరని యాంకర్ అడగ్గా.. దానికి ఆనంద్ దేవరకొండ నవ్వుతూ సమాధానమిచ్చారు. ఏదైనా సినిమా చూసేటప్పుడు హీరోయిన్లపై తనకు క్రష్ ఉంటుందని.. అలా ‘మురారి’లో సోనాలి బింద్రేను చూసినప్పుడు క్రష్ ఏర్పడిందని ముఖ్యంగా ఓ పాట చూశాక తనకు క్రష్ ఫీలింగ్ వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు.






