పాఠశాలలో పుస్తకాల విక్రయంపై గొడవ.. రంగంలోకి దిగిన డీఈఓ

by Jakkula.Mamatha |

ఓ ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల విక్రయం తీవ్ర గొడవకు దారి తీసింది.

పాఠశాలలో పుస్తకాల విక్రయంపై గొడవ.. రంగంలోకి దిగిన డీఈఓ
X

దిశ,డోర్నకల్: ఓ ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాల విక్రయం తీవ్ర గొడవకు దారి తీసింది. ప్రశ్నించేందుకు వెళ్లిన విద్యార్థి సంఘాల నేతల పై యాజమాన్యం పరుష పదజాలంతో దూషిస్తూ అడ్డుకోవడంతో సంఘం నేతలు పాఠశాల వద్ద ధర్నాకు దిగారు. ఈ తతంగం అంతా ఉన్నతాధికారి ఫిర్యాదు చేయడంతో డీఈఓ హుటాహుటిన వచ్చి పుస్తకాల గదిని బుధవారం సీజ్ చేశారు.

ఈ సందర్భంగా డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోతు శాంతి కుమార్, కార్యదర్శి సాయి కుమార్ మాట్లాడుతూ.. జిల్లా విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా బ్రిలియంట్ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు అమ్మకం జరుపుతున్నారని సమాచారం మేరకు పాఠశాలకు చేరుకొని పరిశీలిస్తున్న క్రమంలో యాజమాన్యం, సిబ్బంది ద్వారా అడ్డుకొని బయటకు నెట్టేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అక్కడికి చేరుకున్న ఓ వ్యక్తి నేనెవరో తెలుసా.. అంటూ దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపారు. తక్షణమే ఆయా శాఖల అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ.. బ్రిలియంట్ ప్రైవేటు పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేసినట్లు తెలిపారు. యుఎస్ఎఫ్ఐ, డిఎస్ఎఫ్ఐ, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి భువనగిరి మధు, సూర్యప్రకాష్ తదితరులున్నారు.

Next Story