విద్యా శాఖ ఉన్నతాధికారికి షోకాజ్

by  |
education department
X

దిశ, తెలంగాణ బ్యూరో: 1998 డీఎస్సీలో ఎంపికైన లిస్టు ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన వి.ఎం. బంజరకు చెందిన దావా వెంకటేశ్వర్ రావు సమచారం కోరారు. అయితే సమగ్ర సమాచారం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సమాచార కమిషన్‌కు అప్పిలేట్ చేసుకున్నాడు. దీనితో కమిషనర్ రెండు పర్యాయాలు విచారణ జరుపగా శుక్రవారం మూడోసారి విచారణ చేపట్టారు. అయితే ఈ మూడో విడుత విచారణకు డీఈఓ రాలేదు. దీంతో ఆగ్రహించిన కమిషన్ విద్యాశాఖ అధికారికి నోటీసు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా విచారణ కోసం నోటీస్-3 అందుకున్న 10 మందిలో ఖమ్మం జిల్లా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు(పీఐఓ), అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లను (ఏపీఐఓ)లు, సెక్షన్ ఆఫీసర్లు , అసిస్టెంట్ డైరెక్టర్, డీఈఓలు, జాయింట్ డైరెక్టర్(డీఎస్.ఇ-సీ) ఉన్నారు. అయితే ఇందులో ఎం. వెంకటేశ్వరా చారి, సీహెచ్. శ్రీనివాసరావు, కేవీ. రామారావు మాత్రమే హాజరయ్యారు. డీఈఓలు ఎందుకు హాజరు కాలేదని కమిషనర్ ప్రశ్నించగా జిల్లా కలెక్టర్ సమావేశానికి హాజరయ్యే క్రమంలో విచారణకు హాజరుకాలేకపోయారని ప్రస్తుత పీఐఓగా విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఎం. వెంకటేశ్వరా చారి సమాధానం ఇచ్చారు.

అక్రమాలు, అవకతవకలకు సంబంధించి ఫిర్యాదు దారు దావా వెంకటేశ్వర్ రావు సమగ్రంగా అధికారిక సమాచారం సేకరించారని, మీ వద్ద ఎందుకు లభ్యం కావడం లేదని, మీరెందుకు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారని ప్రశ్నించారు. చెదలు తిన్నాయని ఒకసారి, మిస్ ప్లేస్ అయ్యాయని మరొకసారి పొంతన లేని వివరణ ఇస్తూ చివరకు కోర్టులను కూడా తప్పదోవ పట్టించడం సహేతుకం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదు దారు కోరిన సమాచారం విషయమై అధికారులు మాట్లాడుతూ ఖమ్మం డీఈఓ కార్యాలయం వెతికినా లభ్యం కాలేదన్నారు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ పిటీషన్ దారు పూమణి ప్రస్తుతం పిటీషన్ దారుగా ఉన్న హైకోర్ట్ సింగిల్ జడ్జి బెంచ్‌కు ఇచ్చిన రివైజ్డ్ సెలెక్షన్ లిస్ట్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

దాదాపు 56 మంది పేర్లు రివైజ్డ్ లెక్షన్ లిస్ట్‌లో పేర్కొనకపోవడం ఖమ్మం జిల్లా డీఎస్సీ-98లో భారీ ఎత్తున చోటు చేసుకున్న అక్రమాలు, అవకతవకలకు ఉదాహరణ అని బాధితుడు ఆరోపించారు. 2013లో డీఎస్సీ-1998 సంబంధిత రికార్డులు చెదలు తిన్నా, ఆ తర్వాత ఒరిజినల్ సెలెక్షన్ లిస్ట్ మిస్‌ప్లేస్ అయినా మీరు పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని నాయక్ మండిపడ్డారు. అత్యంత కీలక శాఖ అయిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో రికార్డులు కనిపించని స్థితిలో మీరు వ్యవహరించే తీరు ఇదా..? అని కమిషనర్ ప్రశ్నించారు. విచారణకు హాజరుకానీ విద్యాశాఖ ఉన్నతాధికారికి షోకాజ్ నోటీస్ పంపాలని టీఎస్ఐసీ అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed