మిషన్ భగీరథ పైప్ లీకై నీరు వృధా… పట్టించుకోని అధికారులు

by Kalyani |
మిషన్ భగీరథ పైప్ లీకై నీరు వృధా… పట్టించుకోని అధికారులు
X

దిశ, పెద్ద అడిశర్లపల్లి : వేసవికాలంలో త్రాగునీరు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పి. ఏ పల్లి మండలం అంగడిపేట పెట్రోల్ బంక్ సమీపంలో ఆదివారం మిషన్ భగీరథ పైప్ లైన్ లీకైంది. నీరు వృధాగా పారుతున్న సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపానపోలేదని, ఇరు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని త్రాగునీటి పై అధికారులు దృష్టి పెట్టడంలో కరువయ్యారని ఆరోపిస్తున్నారు. త్రాగునీరు పై నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని, పైప్ లీకేజ్ మరమ్మతులు చేపించి త్రాగునీరు అందేలా చూడాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Next Story

Most Viewed