తొలకరి వచ్చే.. జనం వజ్రాల కోసం వెతికే

by srinivas |
తొలకరి వచ్చే.. జనం వజ్రాల కోసం వెతికే
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో తొలకరి పలకరించింది. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన రైతులకు తొలకరి కనువిప్పు కలిగింది. దీంతో వారంతా పొలం బాట పట్టేందుకు రెడీ అవుతున్నాయి. అయితే వారికి వజ్రాల వేటగాళ్ల భయంపట్టుకుంది. తొలకరి పలకరిచండంతో కర్నూలు జిల్లాలో జనాలు పొలాల్లో తిష్ట వేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఒకటి చాలు కోటీశ్వరులమైపోతామనే ఆశతో వెతుకులాట కొనసాగిస్తున్నారు.

ప్రధానంగా తుగ్గలి మండలం జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి ప్రాంతాల్లో రెండు రోజులుగా వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్కటైనా దొరక్కపోదా అంటూ పొలాల్లో జల్లెడ పడుతున్నారు. అటు రైతులే కాదు, ఉద్యోగులు సైతం పొల్లాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. మధ్యాహ్నం భోజనం తీసుకెళ్లి మరీ అక్కడే ఉండి సాయంత్రం 6 గంటల వరకూ వేట సాగిస్తున్నారు. కొందరు అయితే రాత్రి అయినా సరే ఫోన్ లైట్ వేసుకుని మరీ వజ్రాల కోసం వేట కొనసాగిస్తున్నారు. దీంతో రైతులు అందోళన చెందుతున్నారు. పొలం పనులకు అటంకం కలుగుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాల కోసం తమ పొలాల వైపు రావొద్దని హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు.



Next Story

Most Viewed