‘పల్నాడులో హింసకు చంద్రబాబే కారణం’.. YCP మంత్రి సంచలన ఆరోపణలు

by Satheesh |
‘పల్నాడులో హింసకు చంద్రబాబే కారణం’.. YCP మంత్రి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ వేళ పలు పాంత్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పల్నాడు, చంద్రగిరి, తిరుపతి, తాడిపత్రి, రెంటచింతల నియోజకవర్గాల్లో అల్లర్లు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పోలింగ్ వేళ జరిగిన అల్లర్లపై దర్యాప్తు జరుపుతోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇవాళో రేపో నివేదిక సమర్పించనుంది. ఈ క్రమంలో పల్నాడులో జరిగిన అల్లర్లపై వైసీపీ ఫైర్ బ్రాండ్, మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పల్నాడు‌లో జరిగిన అల్లర్లపై ఇవాళ సిట్‌కు కంప్లైంట్ చేసిన అంబటి.. హింసాత్మక ఘటనలపై దర్యాప్తు చేయాలని అధికారులను కోరారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వేళ పల్నాడులో హింస చోటు చేసుకోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని ఆరోపించారు. హింసను ఆపడంలో పోలీసులు విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు ఓటర్లను భయపెట్టి పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. అధికారం రాదనే చంద్రబాబు ఎన్నికల సమయంలో హింసను ప్రేరేంచారని ధ్వజమెత్తారు. సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ దగ్గర పోలీసులు దబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. అల్లర్లపై తన దగ్గర ఉన్న సమాచారం అంతా సిట్ అధికారులు ఇచ్చానని తెలిపారు.



Next Story