విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రెండో రోజు కొనసాగుతున్న నిరసన..

by Aamani |
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. రెండో రోజు కొనసాగుతున్న నిరసన..
X

దిశ,మెట్ పల్లి : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా మెట్ పల్లి మండలం సత్తెక్కపల్లె గ్రామస్తులు రెండో రోజు కూడా నిరసనకు దిగారు.సత్తక్కపల్లి గ్రామంలో శనివారం విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మల తగుతులుతున్న నేపథ్యంలో విద్యుత్ సరఫరా నిలిపి కొమ్మలు కొడుతున్న క్రమంలో గ్రామానికి చెందిన రాజేష్ అనే విలేఖరి విద్యుత్ వేయాలని విద్యుత్ అధికారులపై ఒత్తిడి తేగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ వేసి గ్రామస్తుల గుండెల్లో గుబులు పుట్టుంచిన ఘటన లో రెండవ రోజు సత్తక్కపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు.సమాచారం అందుకున్న మెట్ పల్లి సీఐ మహేష్ , మల్లాపూర్ ఎస్సై కిరణ్ లు తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఓ విలేఖరి చెప్పిన మాటలు విని విద్యుత్ సరఫరా చేశారని విద్యుత్ షాక్ గురై ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని రెండు రోజులు కావస్తున్నా విద్యుత్ అధికారులపై గాని, రాజేష్ అనే విలేకరి పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను నిలదీశారు.తక్షణమే విద్యుత్ అధికారిని అలాగే విలేఖరి రాజేష్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed