ఐదుగురు జవాన్ల హత్య.. కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్

by Rajesh |
ఐదుగురు జవాన్ల హత్య.. కొనసాగుతున్న ఆర్మీ ఆపరేషన్
X

దిశ, వెబ్‌డెస్క్: జమ్మూ కశ్మీర్ లోని రాజోరిలో ఇటీవల ఐదుగురు ఆర్మీ జవాన్ల హత్య నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ త్రినేత్ర పేరుతో సాగుతున్న వేటలో ఇప్పటికే ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరికి తీవ్రగాయాలు అయినట్లు ఆర్మీ తెలిపింది. ఉగ్రవాదుల నుంచి ఆర్మీ ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాజోరి చేరుకున్నారు. ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ పై ఆయన సమీక్ష చేపట్టారు. శుక్రవారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed