వర్షం పడినప్పుడు మట్టి వాసన ఎందుకు వస్తుందో తెలుసా?

by Jakkula Samataha |
వర్షం పడినప్పుడు మట్టి వాసన ఎందుకు వస్తుందో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయ్యింది. రోజుకు ఒకసారైనా సరే వరుణ దేవుడు తేలికపాటి చిరుజల్లులతో ప్రజలను పలకరిస్తున్నాడు. అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇక ఈసారి ముందుగానే వర్షాలు పడటంతో రైతుల ఆనందం మాములుగా లేదు. వారు తమ పొలం పనులు మొదలు పెట్టేశారు. దుక్కి, పొలం దున్ని, పంటసాగుకై కసరత్తు స్టార్ట్ చేశారు. ఇక వర్షం అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన చాలా మందికి చెప్పలేనంట ఇష్టం. కానీ మీరు ఎప్పుడైనా గమనించారా ఈ స్మెల్ మాములుగా వర్షం పడినప్పుడు, పడటానికి కొంచెం ముందు మాత్రమే వస్తుంటుంది. అయితే దీనికి గల కారణం ఏమిటి అని మీరు ఆలోచించారా? కాగా, దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే తొలకరి వర్షం సమయంలో మట్టి వాసన రావడాకి కారణం మట్టి కాదు అంటున్నారు కొందరు. ఎందుకంటే ఇది మట్టిలో ఉండే ఓ సూక్ష్మజీవి కారణంగా వస్తుందంట. యాక్టినోమోసైట్స్ అనే వర్గానికి చెందిన స్టరెప్టోమీసైట్స్ అనే బ్యాక్టీరియా వర్షం సమయంలో సువాసనను వెధజల్లుతుంది అంటున్నారు వారు. అయితే వేడి వాతవరణం ఉన్న మట్టిలో ఇవి ఎక్కువగా ఉంటాయంట. కానీ ఇవి ఆసయంలో వాసనను వెదజల్లవు కానీ, వర్షం నీరు భూమిని తాకగానే తొలకరి వర్షం కారణంగా ఈ సూక్ష్మజీవులు మీథైల్ ఐసో బోర్నీయోల్, జయోస్మిన్ వంటి రసాయనాలను వదులుతాయంట. దీనినే మనం మట్టి వాసన అంటామంట. ఇక ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది( నోట్ : ఇది ఇంటర్నెట్‌లో సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది, దిశ దీనిని ధృవీకరించలేదు)



Next Story

Most Viewed