పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యకు ఎందుకు విడాకులిచ్చారు? ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా?

by Samataha |
పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యకు ఎందుకు విడాకులిచ్చారు? ఆ సమయంలో ఏం జరిగిందో తెలుసా?
X

దిశ, సినిమా : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన వార్తలే దర్శనం ఇస్తున్నాయి. ఎందుకంటే ? ఎవరూ ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజక వర్గం నుంచి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. దీంతో ఈయనకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తన మొదటి భార్యకు ఎందుకు విడాకులు ఇచ్చారు? అసలు ఆ సమయంలో ఏం జరిగింది అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.

అసలు విషయంలోకి వెళ్లితే.. పవన్ కళ్యాణ్, 1996లో తాను సినిమాల్లోకి రాకముందు. తన తల్లిదండ్రు సెలెక్ట్ చేసిన అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కానీ వీరు ఎక్కువ రోజులు కలిసి ఉండలేకపోయారు. తన భార్య, తనతో సరిగా ఉండటం లేదు అని, పెళ్లి జరిగిన వెంటనే ఆమె ఇంట్లో ఉండకుండా వెల్లిపోయిందని పవన్ ఆరోపించారు. కానీ విడాకులు మాత్రం తీసుకోలేదు. ఇలా ఇద్దరి మధ్య రోజు రోజుకు గొడవలు పెరగడం మొదలు అయ్యాయి. అలాంటి సందర్భంలోనే పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆయన హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హీరోయిన్ రేణు దేశాయ్‌తో ప్రేమలో పడిపోయాడు. అంతే కాకుండా తనతో డేటింగ్ కూడా ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ మొదటి భార్య నాకు విడాకులు ఇవ్వకుండానే వేరే హీరోయిన్‌తో పవన్ ఎఫైర్ పెట్టుకున్నారంటూ ఆయన పై కేసు పెట్టింది. తర్వాత పవన్ ఆ కేసు నుంచి బయటపడి, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చారు. ఆమెకు ఐదు కోట్ల భరణం ఇచ్చి తన నుంచి డివోర్స్ తీసుకున్నట్లు సమాచారం. ఇక తర్వాత రేణు దేశాయ్‌ను పెళ్లి చేసకోవడం, మళ్లీ మనస్పర్థల కారణంగా ఆమెకు విడాకులివ్వడం, తర్వాత విదేశీ వనిత అన్నా లెజినోవాతో డేటింగ్ ప్రారంభించడం, తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తతం పవన్ అన్నా లెజినోవాతోనే ఉంటున్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు.

Next Story

Most Viewed