నీటిలో వేపాకులు కలిపి స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Jakkula Samataha |
నీటిలో వేపాకులు కలిపి స్నానం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : వేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే కొన్ని రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు రోజూ వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం ద్వారా అద్భుత ప్రయోజనాలు కలుగుతాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వేపాకు నీటిలో వేసుకొని స్నానం చేయడం వలన సీజనల్ వ్యాధుల నుంచి బయటపడవచ్చునంట. రోగనిరోధక శక్తి పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా వేప ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయడం వలన ఇన్ఫెక్షన్స్ రావంట, ప్రస్తతం సీజన్ ఛేంజ్ అయ్యింది. వర్షాకాలం ప్రారంభమైంది. అయితే ఈ సమయంలో త్వరగా అంటు వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. అందువలన ప్రతి రోజూ నీటిలో వేపాకు వేసుకొని స్నానం చేయడం వలన వాటి నుంచి బయటపడవచ్చునంట. అలాగే చర్మ వ్యాధులు, అలెర్జీల నుంచి బయటపడటానికి కూడా ఈ వేపాకు చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. అందువలన వేపాకును స్నానం చేసే నీటిలో వేసుకొని తప్పకుండా స్నానం చేయాలి అంటున్నారు నిపుణులు.

అంతేకాకుండా వేపాకు నీటితో స్నానం చేయడం వలన శరీర దుర్వాసన పోవడమే కాకుండా చుండ్రు నివరారణ,కంటి అలెర్జీలను తొలిగించడానికి, చికన్ గున్యా నుంచి బయటపడటానికి ఇది ఉపయోగపడుతుందంట. ఎందుకంటే దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలుచ యాంటీ మైక్రోబయట్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. అయితే నీటిలో వేపాకులను వేసి 20 నిమిషాలు మరగబెట్టాలి. ఎందుకంటే అలా అయితేనే దీని వలన మంచి బెన్ఫిట్స్ ఉంటాయంట.



Next Story

Most Viewed