స్టూడెంట్స్‌కు సన్మానం చేసి రివార్డ్స్ ఇవ్వనున్న స్టార్ హీరో.. ఎందుకంటే..?

by sudharani |
స్టూడెంట్స్‌కు సన్మానం చేసి రివార్డ్స్ ఇవ్వనున్న స్టార్ హీరో.. ఎందుకంటే..?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం ‘ది గోట్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెంకట్ ప్రభు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. ‘అవతార్, అవెంజర్స్’ లాంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్‌కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ‘ది గోట్’ కి పనిచేయంతో.. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్ సామాజిక సేవలో కూడా ముందు ఉంటాడు. గతంలో ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థలకు ఆర్థిక సహాయం చేసి విజయ్ తన గొప్ప మనసును చాటుకున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు మరోసారి విద్యార్థులకు సహాయం చేయనున్నాడు విజయ్. తమిళనాడులోని నియోజకవర్గాల వారీగా టెన్త్, ఇంటర్‌లో టాప్ 3లో నిలిచిన విద్యార్థులకు రివార్డులు అందిచంనున్నారు. జూన్ 28, జులై 3 తేదీల్లో చెన్నై వేదికగా సన్నాన కార్యక్రమం నిర్వహించి.. విద్యార్థులకు సర్టిఫికెట్స్‌తో పాటు రివార్డులను అందజేయనున్నాడు విజయ్. కాగా.. విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed