నిద్ర మాత్రలు మింగిన వితికా షేరు.. కారణమెంటో రివీల్ చేసిన వరుణ్ సందేశ్!

by Hamsa |
నిద్ర మాత్రలు మింగిన వితికా షేరు.. కారణమెంటో రివీల్ చేసిన వరుణ్ సందేశ్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ హ్యాపీ డేస్ మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి సూపర్ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ఇండస్ట్రీకి కొద్ది రోజులు దూరం అయ్యాడు. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బీజీగా ఉంటున్నాడు. అయితే వరుణ్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. హీరోయిన్ వితికా షేరును ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ వీరికి పిల్లలు లేరు. నిత్యం ట్రోల్స్ చేయడంతో నెటిజన్లకు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూ పోస్టులు పెడుతూ ఉంటుంది. ఈ అమ్మడు ఇండస్ట్రీకి దూరమై యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంది. అయితే వరుణ్‌తో పెళ్లి జరిగిన ఏడాదికే వితికా నిద్ర మాత్రలు మింగిందనే వార్త ఒకప్పుడు సోషల్ మీడియాలో సంచనలం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఇలాంటి వార్తలు కావడంతో తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరుణ్ తన భార్య వితిక నిద్ర మాత్రలు మింగడానికి కారణమేంటో రివీల్ చేశాడు.

‘‘వితికాకు ఆ సమయంలో ఆరోగ్యం బాలేదు. దీంతో హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అప్పుడు తనకు నిద్రపోవడానికి ప్రాబ్లమ్ అవుతుందని డాక్లర్‌కు చెప్పడంతో మందులు ఇచ్చాడు. వాటితో పాటు వితిక స్లీపింగ్ పిల్స్ కూడా ఎక్కువగా తీసుకోవడం వల్ల మరోసారి హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అయితే అప్పుడు ఏన్నో పుకార్లు వచ్చాయి. మా మధ్య గొడవల కారణంగానే ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోవాలనుకుందంటూ ఎన్నో రూమర్స్ చూశా. ఇప్పటికీ అలాంటి వార్తలు చూస్తున్నాను. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదు.

అప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. అతి తెలియగానే వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేశాను. అప్పటికే తను కోలుకుని ఈ విషయం క్లారిటీ ఇచ్చేలోపే అంతా వైరల్ అయిపోయాయి. వితిక నా లైఫ్ లైన్. తను ఓ వెబ్ సిరీస్ చేస్తుంది. తొందరలో స్టార్ట్ కాబోతుంది. అందరూ తనను ప్రశంసిస్తుంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉందో నేను దగ్గరుండి చూస్తున్నాను. పెళ్లి వల్ల మా ఇద్దరి జీవితాల్లో చాలా మార్పు వచ్చింది. ప్రస్తుతం అయితే మ్యారేజ్ లైఫ్‌లో ఇద్దరం సంతోషంగా ఉన్నాము. ఎవరి పని వాళ్లు చేసుకుంటూ ఫుల్ బీజి అయిపోయాం. సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్‌కు వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు.

Next Story

Most Viewed