హైదరాబాద్ బిర్యానీపై రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
హైదరాబాద్ బిర్యానీపై రాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తప్పకుండా నాణ్యత చర్యలు పాటించి తీరాలని అన్నారు. హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని గుర్తుచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ప్రతి ఆరు నెలలకు వర్క్‌షాపులు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామని అన్నారు.

కాగా, హోటళ్లు, రెస్టారెంట్లలో కుళ్లిన మాంసాన్ని వాడుతున్నారని వార్తలు విస్తృతమైన నాటి నుంచి తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ముమ్మర దాడులు నిర్వహిస్తూ హడలెత్తిస్తున్నారు. దీనితో నిబంధనలు పాటించని హోటల్, రెస్టారెంట్ నిర్వాహకులు ఆందోళన చెందుతుండగా, ప్రజలు ఈ తనిఖీలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి జిల్లాలోని హోటళ్లలో చోటుచేసుకున్న ఇష్యూలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం తక్షణ చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ హోటల్ నిర్వాహకులతో మంత్రి సమావేశమైన వార్నింగ్ ఇచ్చారు.
Next Story

Most Viewed