ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బాబుని కోరిన పురందేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదేండ్ల మనోహర్

by Mahesh |
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బాబుని కోరిన పురందేశ్వరి, అచ్చెన్నాయుడు, నాదేండ్ల మనోహర్
X

దిశ, వెబ్ డెస్క్: 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎవరూ ఊహించని రీతిలో భారీ విజయాన్ని అందుకుంది. కూటమిలోని టీడీపీ 133 స్థానాల్లో గెలవగా జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. అలాగే బీజేపీ 8 స్థానాల్లో విజయం గెలుచుకుంది. 175 స్థానాలకు గాను కూటమి ఏకంగా 164 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో నేడు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కీలక నేతలు సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా నాదేండ్ల మనోహర్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడు టీడీపీ అధినేత చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. అలాగే ఈ రోజు సాయంత్రం గవర్నర్ నుంచి పిలుపు వస్తుందని, కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు పిలుపునివ్వాలని కోరనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా రేపు(12 బుధవారం) చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమరావతిలోని కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర ఏర్పాటు చేసిన సభా స్థలిపై ఉదయం 11.27 నిమిషాలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయనుండగా ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, అలాగు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు.



Next Story

Most Viewed