రాజకీయ పార్టీలపై ఈసీ సీరియస్.. 3 గంటల్లోగా ఆ పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశం

by Disha Web Desk 19 |
రాజకీయ పార్టీలపై ఈసీ సీరియస్.. 3 గంటల్లోగా ఆ పోస్టులు డిలీట్ చేయాలని ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో పొలిటికల్ పార్టీలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయ్యింది. సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు చేస్తోన్న పోస్టింగ్‌లపై ఈసీ కన్నెర్ర జేసింది. ఈ మేరకు ఈసీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తులు, మహిళలను కించపర్చడం, మైనర్లతో ప్రచారం, జంతువులకు హాని తలపెడుతోన్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నిషేదం అని పేర్కొంది. ఇలాంటి పోస్టులు ఈసీ దృష్టికి వస్తే సంబంధిత వ్యక్తులు, పార్టీలకు నోటీసులు పంపిన మూడు గంటల్లోనే తొలగించాలని ఆదేశించింది. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు పాటించకపోతే పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కాగా, దేశంలో ఈ సారి లోక్ సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవంతంగా రెండు దశలు పూర్తి కాగా.. మంగళవారం థర్డ్ ఫేజ్ పోలింగ్ జరుగుతోంది. 7 దశలు పోలింగ్ ముగిసిన అనంతరం జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

Next Story