చింతలపాలెంలో విరబూసిన మే పుష్పం

by Kalyani |
చింతలపాలెంలో విరబూసిన మే పుష్పం
X

దిశ, చింతలపాలెం:- ప్రతీ సంవత్సరం మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం చింతల పాలెం మండల కేంద్రంలో వికసించింది. ఏడాదిలో ఒక్కసారే వికసించే ఈ పుష్పం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది. మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించే వారు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఫుట్ బాల్ లిల్లీ లేదా బ్లడ్ లిల్లీ అనే ఈ అరుదైన జాతి పువ్వును భారతదేశంలో మే పుష్పం అని పిలుస్తారు. ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు అంటే ఏప్రిల్, మే నెలల్లో పూస్తుంది కనుకనే దీనిని మే పుష్పంగా పిలుస్తారు. చింతలపాలెం మండల కేంద్రంలోని షేక్ అబ్బాస్ నివాసంలోని పెరటిలో ఈ పుష్పం తాజాగా పూసింది. దీనిని ఆయన ఆసక్తిగా ఫోటో తీశారు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూసే మే పుష్పాలను గత 25 సంవత్సరాలుగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు.

Next Story