ఆపరేషన్ సింధూర్..త్రివిధ దళాదిపతులతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-07 03:15:31  IST  )

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరవాత భారత్ వైమానిక దాడులు చేసింది.

ఆపరేషన్ సింధూర్..త్రివిధ దళాదిపతులతో మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై మంగళవారం అర్ధరాత్రి దాటిన తరవాత భారత్ వైమానిక దాడులు చేసింది. పీఓకేతో పాటూ పాకిస్థాన్‌లోని ఉగ్రకదలికలు ఉన్న ప్రాంతాలపై దాడులు చేసి స్థావరాలను ధ్వంసం చేసింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. పహల్గామ్ టెర్రర్ ఎటాక్‌కు గుణపాఠం చెప్పేందుకే దాడులు చేస్తున్నట్టు భారత్ స్పష్టం చేసింది.

ఇక ఇండియా పాకిస్థాన్ మధ్య జరుగుతున్న యుద్దాన్ని భారత రక్షణా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారత్ మెరుపు దాడులు చేసిన తరవాత త్రివిధ దళాదిపతులతో ఆయన మాట్లాడినట్టు సమాచారం. అంతే కాకుండా ఆపరేషన్ సింధూర్ గురించి, ఉగ్రస్థావరాలపై జరిపిన దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను ఉదయం 10 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే 1971 తరవాత పాకిస్థాన్ భూభాగంలోపల భారత్ మెరుపు దాడులు చేయడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం ఇండియా పాకిస్థాన్ బార్డర్ వద్ద కాల్పుల మోత కొనసాగుతూనే ఉంది.

Read More :

ఆపరేషన్ సింధూర్ ముందు ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన వీడియో వైరల్.. అందులో ఏం చెప్పిందంటే?

అర్ధరాత్రి తొలి ఆరెంజ్ ఫైర్ బాల్ దాడి.. అక్కడి పరిస్థితి ఇదే..!

ఊహించని దెబ్బకొట్టిన భారత సైన్యం.. 80 మంది ఉగ్రవాదులు హతం!

Next Story