ఊహించని దెబ్బకొట్టిన భారత సైన్యం.. 80 మంది ఉగ్రవాదులు హతం!

by Kema Shiva Kumar |   (  Updated:2025-05-07 03:24:54  IST  )

పీవోకే (POK)లోని ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం (Indian Army) ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో బాంబుల మోత మోగించింది.

ఊహించని దెబ్బకొట్టిన భారత సైన్యం.. 80 మంది ఉగ్రవాదులు హతం!
X

దిశ, వెబ్‌డెస్క్: పీవోకే (POK)లోని ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం (Indian Army) ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) పేరుతో బాంబుల మోత మోగించింది. మొత్తం 9 చోట్ల జరిపిన వైమానిక దాడుల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భద్రతా వర్గాలు తెలిపాయి. నిషేధిత ఉగ్రవాద సంస్థలైన జైష్-ఎ-మొహమ్మద్ (JEM), లష్కరే-ఎ-తోయిబా (LET), హిజ్బుల్ ముజాహిదీన్‌లతో సంబంధం ఉన్న తొమ్మిది స్థావరాలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. బహవల్పూర్ (Bahawalpur), ముర్కిడే (Murkidae)లో రెండు అతిపెద్ద దాడులు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ వైమానిక దాడుల్లో JEM, LET నిర్వహించే లాంచ్ ప్యాడ్‌లు, శిక్షణా శిబిరాలు రాడికలైజేషన్ కేంద్రాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. ఇప్పటికే ఆ రెండు సంస్థలు రెండూ ఐక్యరాజ్యసమితి ఆంక్షల ప్రకారం ఉగ్రవాద సంస్థలుగా గుర్తించబడ్డాయి. ఉద్రవాదుల ప్రాణ నష్టంపై మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story