Operation Sindoor: అర్ధరాత్రి తొలి ఆరెంజ్ ఫైర్ బాల్ దాడి.. అక్కడి పరిస్థితి ఇదే..!

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-07 03:15:59  IST  )

పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంలో ఆపరేషన్ సింధూర కొనసాగుతోంది..

Operation Sindoor: అర్ధరాత్రి తొలి ఆరెంజ్ ఫైర్ బాల్ దాడి.. అక్కడి పరిస్థితి ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్‌(Jammu kashmir)లో ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) కొనసాగుతోంది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత సైన్యం బలమైన క్షిపణులను ప్రయోగిస్తోంది. జైష్(Jaish), లష్కర్(Lashkar) ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలపై మొదటిసారిగా ఆరెంజ్ ఫైర్ బాల్‌ను ప్రయోగించింది. మంగళవారం అర్ధరాత్రి మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను స్మార్ట్ బాంబు అయిన హమర్‌‌తో భారత్ సైన్యం ధ్వంసం చేసింది. ఈ దృశ్యాలను ఒక్కొక్కటిగా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో భారత్ పంచుకుంది. అయితే ఆ ఉగ్రవాద శిబిరం వద్ద భారీగా ఉగ్రవాదులు, బైకులు, ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ శిబిరంపై దాడి జరిగిన సమయంలో నారింజ రంగు పెద్ద అగ్నిగోళం దిగి అన్నివైపులా తీవ్రమైన పొగ వ్యాపించినట్లుగా భారత్ పోస్టు చేసిన వీడియోల్లో కనిపిస్తోంది. ఈ బాంబు దాడికి దెబ్బకు అక్కడున్న ఉగ్రవాదులు, కొంతమంది స్థానిక ప్రజలు భయంతో అరుస్తూ అరబిక్‌లో ప్రార్థన చేసినట్లుగా తెలుస్తోంది.

కాగా ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లో భారత పౌరులపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది చనిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు భారత్ దీటుగా బదులిచ్చింది. భారత సరిహద్దులో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలను ఏరివేస్తోంది. ఆపరేషన్ సింధూర పేరుతో ఒక్కొక్క శిబిరాలను ధ్వంసం చేస్తోంది. దీంతో పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

Next Story