- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆపరేషన్ సిందూర్ ముందు ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన వీడియో వైరల్.. అందులో ఏం చెప్పిందంటే?

దిశ, వెబ్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)కి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. పీవోకే (POK)లోని ఉగ్రవాదుల శిబిరాలే లక్ష్యంగా భారత సైన్యం (Indian Army) బాంబుల మోత మోగించింది. భారత్ ఆర్మీ చేపట్టిన ఈ వైమానిక దాడులతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల్లో మొత్తం 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారని భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే, ఈ దాడి గురించి ఇండియన్ ఆర్మీ ముందే హించ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ ఉగ్రస్థావరాలపై దాడికి ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్ ఖాతాలో 'రెడీ టు స్ట్రైక్, ట్రైన్డ్ టు విన్' అనే క్యాప్షన్‌తో 1:28 గంటలకు ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ తర్వాత పది నిమిషాలకే ఆర్మీ 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. దాడి చేయబోతున్నట్లు ఆర్మీ ఈ వీడియో ద్వారా ముందే చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Tags
- Operation Sindoor
- India-Pakistan conflict
- India-Pakistan conflict War
- Pahalgam terror attack
- Precision strikes
- Indian Armed Forces
- Pakistan-occupied Kashmir (PoK)
- Cross-border terrorism
- Airstrikes
- Jaish-e-Mohammed
- Lashkar-e-Taiba
- Defence Ministry
- Prime Minister Narendra Modi
- Airspace closure
- Civilian casualties
- Retaliation
- Jammu and Kashmir
- Indus Water Treaty
- Anti-terror operation
- Military escalation






