బడ్జెట్‌ ఆర్మీ అలగ్ బాత్..

by  |
బడ్జెట్‌ ఆర్మీ అలగ్ బాత్..
X

ర్మీ ఆధునికీకరణ అనేది నిరంతర ప్రక్రియ అని దానికి బడ్జెట్‌కు సంబంధం లేదని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే అన్నారు.ఇటీవల కేంద్ర బడ్జెట్-2020లో రక్షణశాఖ బడ్జెట్‌ను రూ.3.18 లక్షల కోట్ల నుంచి రూ.3.37 లక్షల కోట్లకు (6 శాతం) పెంచుతూ కేటాయింపులు జరిపిన నేపథ్యంలో నరవనే తాజా వ్యాఖ్యలు చేశారు.

‘బడ్జెట్ కేటాయింపులతో నిమిత్తం లేకుండా ఆర్మీ ఆధునికీకరణను నిరంతరం చేపడుతూనే ఉంటాం. గత ఏడాది 4 నుంచి 5 రకాల ఆయుధ సిస్టమ్‌లు, ఫ్లాట్‌ఫాంలను ప్రవేశపెట్టాం’ అని నరవనే తెలిపారు. రక్షణరంగ బడ్జెట్ కేటాయింపులపై అడిగినప్పుడు, బడ్జెట్ కేటాయింపులను పూర్తిగా ఏవిధంగా ఉపయోగించుకోవాలనే దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పారు.అత్యున్నత పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల పరిస్థితి ఒకింత మెరుగుపరచాలని ఇటీవల ‘కాగ్’ పార్లమెంటుకు సమర్పించిన నివేదికపై మాట్లాడుతూ, అది 2015-16కు చెందిన నివేదిక అని అన్నారు. అయితే ఇవాల్టి 2020కి తగినట్టుగా సర్వసన్నద్ధంగా దళాలను తీర్చిదిద్దేందుకు తాము కట్టుబడి ఉన్నామని నరవనే భరోసా ఇచ్చారు.

Next Story

Most Viewed