మెగాస్టార్‌ చిరంజీవికి బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టేసిన AP హైకోర్టు

by Satheesh |   ( Updated:2023-07-25 13:26:08.0  )
మెగాస్టార్‌ చిరంజీవికి బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టేసిన AP హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిరంజీవిపై నమోదైన కేసును ఏపీ హైకోర్టు ఇవాళ కొట్టేసింది. కాగా, 2014లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని పోలీసులు చిరంజీవిపై కేసు నమోదు చేశారు. నిర్ణీత సమయంలో సభను పూర్తి చేయలేదని.. చిరు సభ వలన భారీగా ట్రాఫిక్ సమస్యలు వచ్చాయని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసుపై చిరంజీవి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

చిరంజీవి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ ఈ కేసును కొట్టేస్తూ తీర్పు వెలువరించింది. ఇక, సినిమాల్లో మెగ‌స్టార్‌గా ఎదిగిన చిరు.. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించి పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల వల్ల చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి దూసుకుపోతున్న మెగాస్టార్.. పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు.

Read More : పవన్ భక్తులకు గమనిక.. ‘Bro’ ప్రీరిలీజ్ ఈవెంట్ షెడ్యూల్ చేంజ్..

Advertisement

Next Story

Most Viewed