కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్

by  |
కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి హరీశ్‌రావు ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ పార్టీపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులు ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని విమర్శించారు. మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దని కేసులు వేసిన కాంగ్రెస్‌కు ఓటేస్తారా అని ప్రశ్నించారు. మలన్నసాగర్‌ బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వాస్తవాలు చెబుతోందని.. గోబెల్స్ ప్రచారం చేయదన్నారు. దుబ్బాకలో భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed