Bigg Boss-7: హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సీరియల్ నటి అంజలి

by Hamsa |
Bigg Boss-7: హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన సీరియల్ నటి అంజలి
X

దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ షో ఐదోవారం చాలా రసవత్తరంగా ప్రసారమవుతోంది. ఈ సారి ఎలిమినేషన్ నాలుగు వారాలకు భిన్నంగా జరుగుతుందని నాగార్జున ఓ ప్రోమోలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బిగ్‌బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆరుగురు హౌస్‌లోకి వెళ్లబోతున్నట్లు పలు వార్తలు వచ్చాయి.

తాజాగా, దీనిపై మొగలిరేకులు సీరియల్ నటి అంజలి పవన్ యూట్యూబ్ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. అంజలి మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు వెళ్తున్నాన? లేదా? అని చాలామంది అడుగుతున్నారు. బిగ్‌బాస్ అనగానే అమ్మో అనిపించింది. ఎందుకంటే నేను ఇల్లు వదిలి ఎక్కువ రోజులు ఉండలేను. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ, తర్వాత పవన్.. వీళ్లను ఎక్కడికీ వెళ్లలేదు. దాన్విక షాషా పుట్టిన తర్వాత తనే నా ప్రపంచమే పోయింది.

తను బెంగ పెట్టుకుంటుందో లెదో కానీ నేను మాత్రం బెంగ పెట్టుకుంటాను. పవన్ బిగ్‌బాస్‌కు పోతే బాగుండేది. కానీ నేను వెళ్లాలనేసరికి ఆలోచించాను. ఎన్ని రోజులు అక్కడ ఉంటామో తెలియదు. అది సెట్ కాదు అనిపించింది. నన్ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వమని అడిగారు. కానీ నేను వెళ్లాలా? వద్దా అని ఆలోచించాను. అలాగే వెళ్లాక నెగిటివ్ అయి వస్తే బాగోదనిపించింది. అందుకే వెనకడుగు వేశాను. ఈ సీజన్‌కు వద్దు అనుకున్నాను. నేను బిగ్‌బాస్-7 లో పాల్గొనడం లేదు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed