- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
#Hidma: కోనసీమలో కలకలం.. హిడ్మా అనుచరుడు అరెస్ట్
ఏపీలో వరుస మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వరుస మావోయిస్టుల ఎన్కౌంటర్ల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గోదావరి జిల్లాల్లో ఊరూర జల్లెడ పడుతున్నారు. విజయవాడ, విశాఖ, కాకినాడ, విజయనగరం ప్రాంతాల్లో మావోయిస్టులు అరెస్ట్ కావడంతో.. ఇంకా ఎంతమంది ప్రజల్లో ఉన్నారన్న దానిపై ఫోకస్ పెట్టారు.
ఈ నేపథ్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్ రావులపాలెంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన సరోజ్ రావులపాలెం ఎందుకు వచ్చారు? ఆపరేషన్ కగార్, తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో షెల్టర్ కోసమే మావోయిస్టులు ఏపీకి వచ్చారా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కాగా.. నిన్న మారేడుమిల్లి టైగర్ రేంజ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హిడ్మా సహా.. ఆరుగురు మావోయిస్టులు మరణించిన విషయం తెలిసిందే.
Read More..
మార్చి 26 డెడ్‌లైన్.. ఎన్‌కౌంటర్ భయం ఉంటే లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర
BIG BREAKING: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేత టెక్ శంకర్..
పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి.. మల్లోజుల తాజా వీడియో రిలీజ్






