BIG BREAKING: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేత టెక్ శంకర్..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-19 06:09:02  IST  )

ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జియమ్మ వలసలో

BIG BREAKING: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేత టెక్ శంకర్..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలో జియమ్మ వలసలో బుధవారం ఉదయం 6.30-7 గంటల సమయంలో పోలీసులు- మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత అలియాస్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ తో పాటు.. నంబాల కేశవరావు గార్డ్ కమాండర్ జ్యోతి అలియాస్ సరిత, ఏసీఎంలు సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సాయిను అలియాస్ వాసు, అనిత, షమ్మిలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు స్పష్టం చేశారు. దీనిపై మరికాసేపట్లో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

కాగా.. నిన్న మారేడుమిల్లి టైగర్ జోన్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మద్వి హిడ్మా, అతని భార్య రాజే, అనుచరులు.. మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. నేడు మరో ఎన్ కౌంటర్ జరిగిన నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 50 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసి, భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంకా ఎవరైనా మావోయిస్టులు ఉన్నారా అని ఆయా ప్రాంతాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Next Story