పత్తిపాక పాఠశాలకు మూడు కంప్యూటర్లు మంజూరు..

by Kodari Anjali |

విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మూడు కంప్యూటర్లు, వాటికి అవసరమైన ఫర్నిచర్‌ను మంజూరు చేసింది.

పత్తిపాక పాఠశాలకు మూడు కంప్యూటర్లు మంజూరు..
X

దిశ, ధర్మారం: ధర్మారం మండలం పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మూడు కంప్యూటర్లు, వాటికి అవసరమైన ఫర్నిచర్‌ను మంజూరు చేసింది. ఈ మేరకు కంప్యూటర్లు, సంబంధిత సామగ్రి పాఠశాలకు చేరుకున్నట్లు ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న తెలిపారు.ఆధునిక బోధన విధానాలకు అనుగుణంగా విద్యార్థులను సాంకేతిక పరిజ్ఞానంలో తీర్చిదిద్దేందుకు ఈ కంప్యూటర్లు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే వీటిని ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ విద్యను ప్రారంభిస్తామని వెల్లడించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మందాల శ్రావణి హరీష్, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్‌పర్సన్ ఏలేటి పద్మ, ఉపాధ్యాయులు శ్రీలత, శారద, సునిల్, అరుణశ్రీ, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ ప్రేమ్ సాగర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు పాఠశాలకు కంప్యూటర్లు మంజూరు చేసిన మండల విద్యాధికారి ప్రభాకర్, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ షేక్, జిల్లా విద్యాధికారిణి శారదతో పాటు రాష్ట్ర విద్యాశాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story