డెలివరీ పేరుతో ఇంట్లోకి చొరబడే యత్నం.. ఏజెంట్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన తల్లి!

by Ramesh Naini |   (  Updated:2026-07-19 12:30:18  IST  )

ఆన్‌లైన్ ఆర్డర్ డెలివరీ చేసే నెపంతో ఓ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

డెలివరీ పేరుతో ఇంట్లోకి చొరబడే యత్నం.. ఏజెంట్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన తల్లి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆన్‌లైన్ ఆర్డర్ డెలివరీ చేసే నెపంతో ఓ డెలివరీ ఏజెంట్ కస్టమర్ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించిన ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి అతడిని అడ్డుకున్న తల్లిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

జరిగింది ఇదే..!

వైరల్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. జూలై 16వ తేదీ రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఓ డెలివరీ ఏజెంట్ ఆర్డర్ ఇవ్వడానికి ఓ ఇంటికి వచ్చాడు. డెలివరీ తీసుకోవడానికి ఓ చిన్నారి బయటకు రాగా, ఆర్డర్ ఇచ్చిన తర్వాత ‘ప్రూఫ్ ఆఫ్ డెలివరీ’ కోసం తీసిన ఫొటో సరిగ్గా రాలేదనే సాకుతో అతడు నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెట్టే ప్రయత్నం చేశాడు. ఇంట్లో చిన్నారి ఒంటరిగా ఉందని అతడు భావించినట్లు తెలుస్తోంది. అయితే, వెంటనే అప్రమత్తమైన ఆ పాప తల్లి అతడిని డోర్ వద్దే నిలువరించి, బయటే ఉండాలంటూ గట్టిగా నిలదీసింది.

సోషల్ మీడియాలో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేయగా, అది కాస్తా వైరల్‌గా మారి ఇప్పటికే మిలియన్‌కు పైగా వ్యూస్ సాధించింది. ఈ ఘటనపై తక్షణమే స్పందించి ముప్పును నివారించిన తల్లి సమయస్ఫూర్తికి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. డెలివరీ ఫొటోల పేరుతో ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని, ఎదుటివారి ఉద్దేశాలు ఎలా ఉంటాయో ఊహించలేమని కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు డెలివరీలు తీసుకునే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని భద్రతా నిపుణులు మరియు నెటిజన్లు సూచిస్తున్నారు.

హాస్టల్ మెస్‌లోకి దూసుకొచ్చిన భారీ మొసలి.. భయంతో సిబ్బంది, విద్యార్థులు పరుగో పరుగు!

Next Story