- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్టల్ మెస్‌లోకి దూసుకొచ్చిన భారీ మొసలి.. భయంతో సిబ్బంది, విద్యార్థులు పరుగో పరుగు!
రాజస్థాన్‌లోని కోటాలో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోరల్ పార్క్ ప్రాంతంలోని ఓ బాలుర హాస్టల్‌లోకి సుమారు 4 అడుగుల మొసలి చొరబడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజస్థాన్‌లోని కోటాలో ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. స్థానిక కోరల్ పార్క్ ప్రాంతంలోని ఓ బాలుర హాస్టల్‌లోకి సుమారు 4 అడుగుల మొసలి చొరబడింది. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మెట్లు దిగి బేస్‌మెంట్‌లోని డైనింగ్ ఏరియా (మెస్)లోకి మొసలి దర్జాగా వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. అకస్మాత్తుగా మొసలిని చూసిన వంట మనుషులు, సిబ్బంది, విద్యార్థులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అది మరింత భయపడి మెస్‌లో అటూఇటూ కదలడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. మొసలి వచ్చిందని తెలియడంతో దాన్ని చూసేందుకు భారీగా జనం అక్కడికి చేరుకున్నారు. వర్షాకాలం కావడంతో సమీపంలోని మురుగుకాల్వ ద్వారా ఇది హాస్టల్‌లోకి వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
చంబల్ నదిలో విడిచిపెట్టిన అధికారులు
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మొసలిని సురక్షితంగా బంధించారు. అనంతరం దాన్ని తీసుకెళ్లి దాని సహజ సిద్ధ ఆవాసమైన చంబల్ నదిలో వదిలేయడంతో విద్యార్థులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అటవీశాఖ అధికారి వీరేంద్ర సింగ్ వెల్లడించారు.






