మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంపై కేసు నమోదు.. 8 మంది అరెస్ట్

by Vemula.Srinu Prasad |

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు...

మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబంపై కేసు నమోదు.. 8 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం(Former Speaker Tammineni Sitaram) కుటుంబంపై పోలీసులు కేసు(Police Case) నమోదు చేశారు. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం(Srikakulam)లో రూ. 4 కోట్ల విలువైన భూ కబ్జా(Land Grab)కు కుట్ర చేశారనే ఆరోపణలపై సబ్ రిజిస్ట్రార్ అరుణతో పాటు మొత్తం 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో కేసును పర్యవేక్షిస్తున్నారు. వృత్తి రీత్యా హైదరాబాద్‌లో ఉన్న వ్యక్తికి శ్రీకాకుళంలో స్థలం ఉంది. దాని విలువ కోట్లలో ఉండటంతో తమ్మినేని సీతారాం కుటుంబం కన్ను పడింది. దీంతో ఆ స్థలాన్ని నకిలీ పత్రాలతో దక్కించుకేనేందుకు కుట్ర చేశారు. ఈ మేరకు తమ్మినేని సతీమణితో పాటు కుమారుడు చిరంజీవి నాగ్ కూడా అరెస్ట్ అయ్యారు.

Next Story