భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదొక చరిత్రాత్మక ఘట్టం : పీవీ సింధు విజయంపై సీఎం హర్షం

by Naga Rani Yarlagadda |

జపాన్ ఓపెన్ లో దేశం గర్వించేలా పీవీ సింధు సంచలన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదొక చరిత్రాత్మక ఘట్టం : పీవీ సింధు విజయంపై సీఎం హర్షం
X

దిశ, వెబ్‌డెస్క్: జపాన్ ఓపెన్ లో దేశం గర్వించేలా పీవీ సింధు సంచలన విజయం సాధించడంపై సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఉత్కంఠపోరులో సంచలన విజయంతో సింధు సరికొత్త మైలురాయిని లిఖించారని కొనియాడారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇదొక చరిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. అద్భుతమైన విజయం అందుకున్న పీవీ సింధుకు అభినందనలు తెలియజేశారు. రాబోయే ఒలింపిక్స్ లోనూ ఆమె ఇదే జోరు కొనసాగించాలని ఆకాంక్షించారు. దేశానికి బంగారుపతకాన్ని తీసుకుని రావాలని ఆశిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ఎక్స్ లో పేర్కొన్నారు.

భారత బ్యాడ్మింటన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించారు. ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో అద్భుతంగా ఆడి.. జపాన్ ఓపెన్ టైటిల్ ను కైవసం చేసుకున్నారు. సింధు కెరీర్ లోనే కాదు.. ఏ భారత షట్లర్ కూ సాధ్యంకాని రీతిలో జపాన్ ఓపెన్ టైటిల్ ను కౌవలం చేసుకున్న తొలి భారతీయ మహిళా షట్లర్ గా సరికొత్త రికార్డును తనఖాతాలో వేసుకున్నారు.

Next Story