- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి 26 డెడ్‌లైన్.. ఎన్‌కౌంటర్ భయం ఉంటే లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర
ఏపీలో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో వరుసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా కీలక ప్రకటన చేశారు. బుధవారం ఉదయం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్ కగార్, తెలంగాణలో కొందరు మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో షెల్టర్ కోసం మావోయిస్టులు ఏపీలోని కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారని తెలిపారు. కొన్నాళ్లు షెల్టర్ తీసుకున్నాక ఇతర సరిహద్దు రాష్ట్రాలకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారని వివరించారు.
ఎన్‌కౌంటర్ భయం ఉంటే లొంగిపోండి..
మావోయిస్టులు లొంగిపోవడానికి వస్తే స్వాగతిస్తామని తెలిపారు. 2026 మార్చి నాటికి ఆపరేషన్ కగార్ ను ముగిస్తామని.. ఈ లోగా ఎవరికైనా ఎన్‌కౌంటర్ భయం ఉంటే మీడియా ద్వారా లొంగిపోవచ్చునని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 50 మంది మావోయిస్టుల్ని అరెస్ట్ చేశామని తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఎవరినీ తాము ఎన్ కౌంటర్ చేయలేదన్నారు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉండి ఉంటే పోలీసుల ఎదుట లొంగిపోవచ్చని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఉన్న రివార్డులను వారికే ఇచ్చి.. పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
మృతులకు నేడు పోస్టుమార్టం
నిన్న (మంగళవారం) జరిగిన ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలు రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నాయని, పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. కాకినాడ, విశాఖ ఫోరెన్సిక్ టీమ్ కాసేపట్లో పోస్టుమార్టం నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రి వద్ద భారీగా బలగాలను మోహరించారు.
తాజాగా జియ్యమ్మ వలసలో మరో ఎన్‌కౌంటర్ జరగ్గా.. ఆ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్ లో ఎవరెవరు మరణించారో ఇంకా స్పష్టత లేదని, కీలక నేతలు చనిపోయినట్లు సమాచారం అందిందన్నారు. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Read More..
BIG BREAKING: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో ఆజాద్, దేవ్‌జీ?
BREAKING: జర్నలిస్టుకు హిడ్మా చివరి లేఖ.. లొంగుబాటుపై కీలక అంశాలు
జియ్యమ్మ వలస ఎన్‌కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోయిస్టులు వీరే






