- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జియ్యమ్మ వలస ఎన్‌కౌంటర్.. మృతిచెందిన ఏడుగురు మావోయిస్టులు వీరే
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జియ్యన్న వలసలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి సమీపంలోని జియ్యన్న వలసలో బుధవారం ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు. వీరిలో మావోయిస్ట్ ఏఓబీ ఇన్ ఛార్జ్ మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ అలియాస్ శంకర్ అలియాస్ బాబు అలియాస్ శివ ఉన్నట్లు నిర్ధారించారు. దివంగత మావోయిస్ట్ నంబాల కేశవరావు వద్ద గార్డ్ కమాండర్ గా ఉన్న జ్యోతి అలియాస్ సరిత, సౌత్ జోనల్ కమిటీ సభ్యుడు సురేష్ అలియాస్ రమేష్, జాగరగొండ ఏరియా మిలిషియా కమాండర్ లోకేష్ అలియాస్ గణేష్, ఏసీఎంలు షైనూ అలియాస్ వాసు, అనిత, షమ్మిలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యాక వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామన్నారు. కాగా.. నిన్న ఎన్ కౌంటర్ లో మద్వి హిడ్మా సహా మరణించిన ఆరుగురి మృతదేహాలకు రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో కాకినాడ, విశాఖ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ టీమ్స్ పోస్టుమార్టం చేస్తున్నాయి.
Read More..
పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి.. మల్లోజుల తాజా వీడియో రిలీజ్
BIG BREAKING: ఏపీలో మరో భారీ ఎన్‌కౌంటర్.. మృతుల్లో అగ్రనేత టెక్ శంకర్..






