పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి.. మల్లోజుల తాజా వీడియో రిలీజ్

by Prasad Jukanti |   (  Updated:2025-11-19 06:12:49  IST  )

మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందని మాజీ మావోయిస్టు మల్లోజుల వీడియో రిలీజ్ చేశారు.

పరిస్థితులు మారుతున్నాయి.. మావోయిస్టులు ఆయుధాలు వీడి రండి.. మల్లోజుల తాజా వీడియో రిలీజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీలోని ఏజెన్సీ ప్రాంతం వరుస ఎన్ కౌంటర్లతో దద్దరిల్లుతోంది. నిన్న మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్ కౌంటర్‍లో ఆరుగురు మావోయిస్టులు చనిపోగా తాజాగా ఇవాళ జరిగిన మరో ఎన్ కౌంటర్‍లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో మాజీ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ (Mallojula Venugopal) కీలక వీడియో రిలీజ్ చేశారు. ఆపరేషన్ కగార్ కారణంగా గత కొంత కాలంగా మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఎన్ కౌంటర్ల వల్ల ఇప్పటికే పలువురు మావోయిస్టు కీలక నేతలు మృతి చెందారు. తాజాగా హిడ్మా సైతం ఎన్ కౌంటర్ (Hidma Encounter) అయ్యారని ఈ నేపథ్యంలో మావోయిస్టులు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వీడియో సందేశం (Video Message) పంపించారు. మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. పరిస్థితులు మారుతున్నాయి.. దేశం కూడా మారుతోంది. ఎన్ కౌంటర్లలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే మావోయిస్టులు అజ్ఞాతం వీడి ప్రజల్లోకి రావాలని విజ్ఞప్తి చేశారు. లొంగిపోవాలని అనుకునే మావోయిస్టులు తన ఫోన్ నంబర్ 8856038533 ను సప్రదించాలని సూచించారు.

Read More... #Hidma: కోనసీమలో కలకలం.. హిడ్మా అనుచరుడు అరెస్ట్

మార్చి 26 డెడ్‌లైన్.. ఎన్‌కౌంటర్ భయం ఉంటే లొంగిపోండి: ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర

Next Story