నర్సంపేటలో చిల్లర దొంగలు.. నిలిపి ఉన్న వాహనాల బ్యాటరీలే లక్ష్యం

by Jakkula.Mamatha |

నర్సంపేట పట్టణంలో అర్ధరాత్రిళ్లు దొంగలు చెలరేగిపోతున్నారు.

నర్సంపేటలో చిల్లర దొంగలు.. నిలిపి ఉన్న వాహనాల బ్యాటరీలే లక్ష్యం
X

దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలో అర్ధరాత్రిళ్లు దొంగలు చెలరేగిపోతున్నారు. నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని బ్యాటరీలను దొంగిలిస్తున్నారు. తాజాగా నర్సంపేట పట్టణంలోని పాకాల రోడ్డు సమీపంలో ఓ షాపింగ్ మాల్ పక్కన దొంగతనానికి పాల్పడ్డారు. నిలిపి ఉన్న వాహనాల నుంచి రెండు బ్యాటరీలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇద్దరు యువకులు దొంగతనానికి పాల్పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. గత కొంత కాలంగా పట్టణంలో గంజాయి సేవనం ఎక్కువైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రిళ్ళు పెట్రోలింగ్ తక్కువ కావడంతో ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. గతంలో వరంగల్ రోడ్డు వైపు తరచూ డీజిల్, బ్యాటరీ దొంగతనాలు జరిగిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల్లోనే బాధ్యులను అరెస్టు చేసి కట్టడి చేశారు. అయితే తాజాగా పట్టణ మధ్యలోకి దొంగతనాలు పాకడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. రాత్రిళ్ళు పెట్రోలింగ్ పెంచి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story