- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అల్లుడు మృతి చెందాడని ఆగిన అత్త గుండె
కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మున్సిపల్ పరిధి కొత్తపల్లి గ్రామంలో అత్యంత విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన అల్లుడు, అత్త మరణించడంతో కుటుంబం అంతా శోకసంద్రం నెలకొంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన రంజిత్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మద్యానికి తీవ్రంగా బానిసయ్యాడు. అతిగా మద్యం సేవించడం వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఈ క్రమంలోనే అనారోగ్యంతో బాధపడుతూ నడుచుకుంటూ వెళ్తున్న రంజిత్, ఒక్కసారిగా రోడ్డుపైనే కుప్పకూలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రంజిత్ మరణవార్త తెలుసుకున్న ఆయన అత్త పద్మ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
కళ్లముందే అల్లుడు నిర్జీవంగా పడి ఉండటాన్ని ఆమె తట్టుకోలేకపోయారు. ఘటనా స్థలంలోనే తీవ్రమైన మానసిక ఆవేదన, గుండెపోటుతో పద్మ కూడా అక్కడికక్కడే కన్నుమూశారు. మద్యానికి బానిసైన అల్లుడు ఒకవైపు, ఆ మరణవార్త తట్టుకోలేక అత్త మరోవైపు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ హృదయవిదారక ఘటన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.






