అధికార హోదాలో ఉన్నా చొరవ.. మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డిపై ప్రశంసలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-20 12:00:36  IST  )

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికు అనూహ్య ఘటన ఎదురైంది. ఆయన వాహన శ్రేణి మదనపల్లిలో వెళ్తుండగా ఒక్కసారిగా మతిస్థిమితం లేని మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు...

అధికార హోదాలో ఉన్నా చొరవ.. మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డిపై ప్రశంసలు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాష్ట్ర గనుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికు అనూహ్య ఘటన ఎదురైంది. ఆయన వాహన శ్రేణి మదనపల్లిలో వెళ్తుండగా ఒక్కసారిగా మతిస్థిమితం లేని మహిళ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు. దీంతో వాహనం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించారు. ఈ మేరకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వాహనం నుంచి దిగి నేరుగా ఆ మహిళ వద్దకు వెళ్లారు. ఆమె మానసిక స్థితిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. సదరు మహిళకు తక్షణమే తగిన సహాయం అందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించడంతో పాటు, సురక్షిత ప్రాంతానికి చేర్చాలని సూచించారు. దీంతో అనాథ మహిళ ప్రాణాల పట్ల మంత్రి చూపిన చొరవపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Next Story