మదర్ ఇండియా’ ఫామ్ ల్యాండ్ దందా

by Malleboina Mahesh |

నారాయణఖేడ్ నాగల్ గిద్దలో 'మదర్ ఇండియా' ఫామ్ ల్యాండ్ దందా.. అనుమతులు లేని వెంచర్లు, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదులు!

మదర్ ఇండియా’ ఫామ్ ల్యాండ్ దందా
X

దిశ, నారాయణఖేడ్: భూముల విలువలు పెరిగిన నుంచి రియల్ వ్యాపారంలో అడ్డగోలుగా డబుల్ రిజిస్ట్రేషన్లు, భూమి ఒకచోట చూపించి మరొకచోట రిజిస్ట్రేషన్లు, రోడ్డు పక్కన భూమి చూచి ఎక్కడో భూమిని రిజిస్ట్రేషన్ చేయడం, బ్రోకర్లతో మోసం చేస్తున్నారని జాగ్రత్త వహించాలని పోలీసులు తెలిపి నా కూడా ఈ మండలంలో భూ దందా ఆగడం లేదు. భూమిలో మోసం చేయడం అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో నాగల్ గిద్ద మండలం పుట్టినిల్లుగా మారింది. నాగల్ గిద్ద రోడ్డులో ప్రధానంగా మోర్గి, ఔదాత్ పూ ర్ గ్రామంలో మదర్ ఇండియా ఫామ్ లాండ్ కొనుగోలు చేశారు. పక్కనే ఉన్న బీదర్, నిమ్జ్, పది కిలోమీటర్ దగ్గరనే నేషనల్ హైవే ఉందంటూ అతి తక్కువ ధరకే ప్లాట్లు, నాలుగు సంవత్సరాల్లోనే 10వంతుల రెట్టిం పు ధరకు అమ్ముకోండి అంటూ అందమైన యాడ్ లతో విక్రయ దారులకు బురిడీ కొట్టిస్తున్నారు. ఐఐటి, సాఫ్ట్వేర్ , రిటైర్మెంట్, పేద, మధ్యతరగతి అమాయక ప్రజలను ఆసరా చేసుకుని పిల్లల భవిష్యత్తు భావితరాల బాగు కోసం ఇన్వెస్ట్ మెంట్ (లాంగ్ టైం పెట్టబడి) అభివృద్ధి చేస్తామని రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొత్త మార్గాలను వెతుకుతూ సొమ్ము చేసుకుంటున్నరు.

2022 లో ఫాం ల్యాండ్ ఏర్పాటు చేశారు. నాగల్ గిద్ద మండలం ఔదాత్ పూర్ గ్రామ శివారులో 37 ఎకరాలు, ఎస్గి గ్రామ శివారులో 4 ఎకరాలు, ఔదాత్ పూర్ శివారులో నిరుపేదలకు ఇచ్చిన ఆ సైన్డ్ భూమి సర్వేనెంబర్ 12, 15 లో 7 ఎకరాల 20 గుంటల భూమిని గత నాలుగు సంవత్సరాల క్రితం ఒక ప్రజా ప్రతినిధి మంచి ఆంధ్రకు వ్యక్తి కొనుగోలు చేశారు. అసైన్డ్ భూమిని అమ్మ వద్దు కొనవదని నిబంధనలు ఉన్నప్పటికీ నిరుపేదలకు ఇచ్చిన భూమిని సెల్ డీడ్ చేసుకొని అమాయకులకు అంటగట్టారు. మొర్గి గ్రామ శివారులో 48 ఎకరాల భూమిని కొనుగోలు చేసి మదర్ ఇండియా ఫామ్ లాండ్ ఏర్పాటు చేశారు. పోలీసులు పక్కన ఉన్న వారికి తెలుసుకొని సర్వే నంబర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా..? రెవెన్యూ రికార్డులను పరిశీలించి భూములను కొనుగోలు చేయాలని అవేమీ పట్టించుకోకుండా రియర్లు అధికారులు కుమ్మక్కై రాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని సమాచారం. ప్రజాప్రతినిధుల అండదండలతో ఫామ్ ల్యాండ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది.

అక్రమార్జనకు అలవాటుపడ్డ మదర్ ఇండియా ఫామ్ లాండ్ ఎలాంటి అనుమతి రియల్ ఎస్టేట్ సంస్థలు బ్రోచర్లను పెట్టి ప్రతి ఆదివారం మేకలతో విందు భోజనం ఏర్పాటు చేస్తూ.. ఎడ్ల బండి పై ఆకర్షణీయమైన ఊరేగింపు చేస్తూ అమాయకమైన ప్రజలకు కస్టమర్లకు మాయ మాటలు చెప్పుతు 33 ఫీట్ల ఇంటర్నల్ రోడ్డు, సెట్టింగ్ ట్యాంకు, సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ వైరింగ్, ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫర్, బోర్ వెల్ వాటర్ స్టోర్స్ సిస్టం, మామిడి, జామ, యాపిల్, సపోటా, కొబ్బరికాయ ప్లాంట్స్ పండ్ల చెట్ల పెంపకం గురించి హామీ ఇచ్చినప్పటికీ ఈ చెట్లను నిజంగా పెంచుతున్నారా లేదా అన్న గ్యారెంటీలో ఎలాంటి స్పష్టత లేదు. ప్రతి ప్లాటుకు 5 లక్షల ఇన్సూరెన్స్, రైతు బీమా, రైతుబంధు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్నారు. కమ్యూనిటీ ఫార్మ్ ల్యాండ్ కు రీసెంట్, చిల్డ్రన్ ప్రమేయన ఏరియా ఇండోర్ గేమ్స్, క్యారమ్ సేమ్ టేబుల్ టెన్నిస్, అవుట్ డోర్, టెన్సింగ్ కోర్టు, క్రికెట్, బాక్సింగ్, వాలీబాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్ పూల్, కా ప్యార్, కెప్టన్స్ కస్టమర్ రెడిట్ ఫామ్ హౌస్ అంటూ కొత్త దందాకు తెరలేపి కస్టమర్లకు బురిడీ కొట్టిస్తున్నారు.

వ్యాపారులకు అధికారుల అండ..

పాసు పుస్తకాలతో ఫ్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయాలని నాగల్ గిద్ద తహసిల్దార్ కార్యాలయానికి వెళ్తే రైతులను, సామాన్యులకు కొర్రీలు పెట్టే తాసిల్దార్ వెంచర్ దారులకు సునాయాసంగా రిజిస్టర్లు చేస్తున్నారు. నాలా కన్వర్షన్ చేయడానికి 20 గుంటలకు పై మీద ఉంటేనే కన్వర్షన్ చేయాలి. అలా కాకుండా వారి స్వలాభం కొరకు వెంచర్ దారులకు గుంట, 2, గుంటలు రిజిస్టర్లు చేసి, నాలా కన్వర్షన్ చేసి వ్యాపారానికి తోడుపడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తాసిల్దార్ కు చేతికి మట్టి అట్టకుండా భూ భారతి ఆపరేట్లతో ముడుపులు తీసుకుని దందా చేస్తున్నరని ఆరోపణలు ఉన్నాయి.

ఎలాంటి పర్మిషన్లు ఉండవు..

వెంచర్ చేయాలంటే డీటీసీపీ, రేరా, గ్రామ పంచాయతీకి 10 శాతం శాతం ల్యాండ్ మార్టి గేజ్ చేసిన తర్వాత రోడ్లు, విద్యుత్తు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇతర పనులను డెవలప్మెంట్ చేసి ప్లాట్లు విక్రయించాలని ఉంటుంది. ఇవన్నీ చేయడం ఎందుకని అడ్డదారిలో ప్లాట్లు అమ్మే సౌకర్యాన్ని మదర్ ఇండియా ఫామ్ ల్యాండ్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెరదీశారు. భూమి వ్యవసాయ భూమి అయితే, దానిని నాన్ -అగ్రికల్చర్ ఉపయోగం కోసం మార్చడానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి తీసుకోవాలి.

బ్రోకర్లు, బ్రోచర్లతో దందా షురూ..

అందమైన బ్రోచర్లు, లేఔట్ ప్లాన్ తో అమ్మకానికి సిద్ధమైన వెంచర్ భూ భాగోతం అంతా అంతా కాదు. భూ భారతి స్లాట్ బుక్ చేసుకుని వ్యవసాయ భూమిగా ఒక్క గుంట స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత నాలా కన్వర్షన్ తాసిల్దార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసి ఆ ప్రొజెటింగ్తో గజాల చొప్పున మళ్లీ నాగల్ గిద్ద మండల కేంద్రంలో రిజిస్టర్ చేస్తారు. ఇలా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్లు చేస్తూ గ్రామ పంచాయతీ ఆదాయానికి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కొనుగోలుదారులను, ప్రజలను మోసం చేస్తున్నారు. ప్లాట్ కొన్న తర్వాత చట్ట ప్రకారం అన్ని పర్మిషన్లు ఉంటేనే గ్రామపంచాయతీలో నమోదు చేసుకుంటారు. ఇలా కొనుగోలు చేసిన డాక్యుమెంట్లో కొనుగోలుదారుడు గ్రామపంచాయతీలో నమోదు చేసుకోవడానికి వెళితే ఆ వెంచర్ కి పర్మిషన్ లేదని సమాధానము ఎదురవుతున్నది. ధనర్జన తో మోసాలకు తెగబడుతున్న వెంచర్ల నుంచి ప్రజలను కాపాడవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉన్నది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం..

వ్యవసాయ భూములను వెంచర్లుగా ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం నిబంధనల ప్రకారం మొదట వాటిని నివాస స్థలాలు గా మార్చుకోవాలి. రుసుము చెల్లించి నాలా కన్వెన్షన్ తో పాటు గ్రామ పంచాయతీ నుంచి లే అవుట్ అనుమతి పొందాలి. ఇవేమీ లేకుండానే వెంచర్ నిర్వాకుడు ప్లాట్లను విక్రయిస్తుండటం గమనార్హం.

డబుల్ రిజిస్ట్రేషన్ల దందా..

వ్యవసాయమే ప్రధాన వృత్తిగా నమ్ముకు ని జీవనం సాగిస్తున్న అన్నదాతలు వందల ఎకరాల్లో భూములను అమ్ముకుని కూలీలు గా మారుతున్నారు. హైదరాబాద్ లో కూలీలుగా పనిచేస్తున్నారు. నాలుగు ఎకరాల భూమి సీబీసీఐడీ పరిధిలో ఉండడంతో రైతులు జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో అనేకసార్లు ఫిర్యాదు చేశారు. కొందరు అమాయకులను అడ్డంగా పెట్టుకుని రియల్ దందాకు ఎగబడుతున్నారు. అప్పట్లో కొన్ని రోజు లు ఆగిన తర్వాత మళ్లీ యధావిధిగా భూములు కొనుక్కోవడం డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. గ్రామాల్లో చక్రం తిప్పుతున్న కొందరు పెద్దలు రియల్ మాఫియాతో చేతులు కలిపి గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసుకుంటున్నా రు. నాగల్ గిద్ద మండల కేంద్రంలో గత నాలుగు సంవత్సరాల నుంచి డబ్బులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికి రోజు మోసం జరుగుతూనే ఉంది కానీ ఆగడా లు ఆగలేదు. దీంతో కొనుగోలు దారులు పోలీస్ స్టేషన్ లో అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. డబుల్ రిజిస్ట్రేషన్ తో జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా చాలా సందర్భంలో ఫిర్యాదు చేశారు.

Next Story