- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నర్వ పెద్ద చెరువుపై అక్రమంగా చేపల చెరువు నిర్మాణంపై కలెక్టర్‌కు ఫిర్యాదు
నర్వ మండల ప్రజలు, వివిధ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి నారాయణపేట జిల్లా కలెక్టర్కుకు వినతి పత్రం అందించారు.

దిశ, నర్వ: మండల కేంద్రంలోని నర్వ పెద్ద చెరువులోని సర్వే నెంబర్107,108 లో గల చెరువులో అక్రమంగా చేపల చెరువును నిర్మిస్తున్న రవికుమార్ ప్రసన్నవ్యక్తిలు అక్రమంగా చేపలను చెరువు నిర్మాణాన్ని చేపట్టడంతో నర్వ మండల రైతులు నాయకులు గ్రామ ప్రజలు వివిధ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్లి నారాయణపేట జిల్లా కలెక్టర్కుకు వినతి పత్రం అందజేశారు. నర్వ అంబేద్కర్ చౌరస్తా నుండి నర్వ గ్రామంలో వీధుల్లో బ్యానర్లు పట్టుకొని గ్రామాలు నిరసన తెలియజేశారు. ఈ యొక్క నిర్మాణం చేపడితే నర్వ చెరువ కలుషితమయ్యి ప్రమాదం ఏర్పడుతుందని నర్వ రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. వేసవికాలంలో ఆరుతడి పంటలు పొలాలు వీడు భూములుగా మారుతాయని అన్నారు. తాగడానికి కూడా పశువులకు నీరు కూడా లభించదని అన్నారు. నర్వ పెద్ద చెరువు ఆయకట్టు కింద ఉండే పొలాలు బీడు భూములుగ మారుతాయని అన్నారు. 300 ఎకరాల ఆయకట్టుకు కింద ఇప్పుడు చాపల చెరువు నిర్మిస్తే గ్రామ ప్రజలకు రోగాలు ప్రవళించే అవకాశం ఉందని అన్నారు. ఇట్టి నిర్మాణాన్ని నిలిపివేయాలని రాలేదన్న వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నర్వ గ్రామ ప్రజలు వివిధ పార్టీ నాయకులు యువకులు పాల్గొన్నారు.






